బాలయ్య సినిమా కోసం బోయపాటి పారితోషికం 15 కోట్లు!

  • 'రూలర్' గా రానున్న బాలకృష్ణ
  • తదుపరి సినిమా బోయపాటితో 
  •  హీరోయిన్ కోసం అన్వేషణ  
బాలకృష్ణ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రూలర్' సిద్ధమవుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, బాలకృష్ణ తదుపరి సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ తదుపరి సినిమాకి బోయపాటి శ్రీను దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

70 కోట్ల బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకిగాను బాలకృష్ణ 10 కోట్ల పారితోషికాన్ని అందుకుంటూ ఉండగా, బోయపాటి పారితోషికం 15 కోట్లు అని తెలుస్తోంది. బాలకృష్ణ కంటే ఎక్కువ పారితోషికాన్ని ఆయన అందుకుంటూ ఉండటం, 'వినయ విధేయ రామ' వంటి భారీ పరాజయం తరువాత ఆయన ఆ స్థాయిలో డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ సరసన కీర్తి సురేశ్ ను అనుకున్నారు. అయితే ఆమె ఆసక్తిని చూపకపోవడం వలన, మరో హీరోయిన్ ను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం.
Go Back to Shorts
Balakrishna
Boyapati Sreenu

More Telugu News